బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
KTR: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి చేరుతున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది.
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత హన్మకొండలో ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 504, 505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ నేతలకు ఇచ్చారని కేటీఆర్ ఆరోపణలు చేశారు.