»Bhajanlal Sharma Took Oath As Rajasthan Cm On His Birthday
Bhajanlal Sharma: పుట్టినరోజు నాడే రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ ప్రమాణ స్వీకారం
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ నేడు తన పుట్టినరోజు నాడే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
Bhajanlal Sharma took oath as Rajasthan CM on his birthday
భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మ(Bhajanlal Sharma) శుక్రవారం రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా(Rajasthan CM) ప్రమాణ స్వీకారం(oath)చేశారు. ఆయనతో పాటు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్‌లోని చారిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతోపాటు అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ అగ్రనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
Bhajanlal Sharma takes oath as Rajasthan Chief Minister, Diya Kumari and Prem Chand Bairwa sworn in as Deputy CMs
నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో BJP గణనీయమైన విజయాన్ని సాధించింది. పోటీ చేసిన 199 స్థానాల్లో (200 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి) 115 స్థానాలను గెలుచుకుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 69 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మంగళవారం జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అజ్మీర్ నార్త్ ఎమ్మెల్యే వాసుదేవ్ దేవ్నాని అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. అరంగేట్రంగా ఎమ్మెల్యే అయిన భజన్‌లాల్ శర్మ ఈరోజు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా..ఇదే రోజు ఆయన 56వ పుట్టినరోజు కావడం విశేషం. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రేమ్ చంద్ బైర్వా జైపూర్‌లోని మోతీ డుంగ్రీ గణేష్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
భజన్ లాల్ శర్మ ఎవరు?
రాజస్థాన్‌లో సీఎం పదవి ఎవరికి ఇస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో రాజస్థాన్ అత్యున్నత పదవికి ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే అతను పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశానని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న శర్మ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అతను ఈసారి తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు, అతను 34 సంవత్సరాలుగా రాజకీయాల్లోనే ఉండటం విశేషం. అంతేకాదు ఆయన గతంలో కూడా అనేక పదవులను నిర్వహించారు. BJP యువ సంస్థ భారతీయ జనతా యువ మోర్చాతోపాటు వివిధ హోదాలలో పనిచేశారు. RSS విద్యార్థి విభాగం ABVPతో కూడా సంబంధం కలిగి ఉన్నారు. భరత్పూర్ జిల్లాలోని నాద్బాయికి చెందిన అతను అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, 27 సంవత్సరాల వయస్సులో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. ఆ క్రమంలోనే పార్టీ వర్గాల్లో ఆయన మంచి అంకితభావంతో పని చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ అధిష్టానం సీఎం పదని అప్పగించడం విశేషం.