Rajasingh Hatrik is the BJP candidate in Goshamahal constituency
Raja Singh: రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం..అక్బరుద్దీన్ ఒవైసీ ముందు మా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కాసిం రిజ్వీ వారసుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటూ తేల్చి చెప్పేశారు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను చంపేస్తానని చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ప్రొటెం స్పీకర్గా చేసిందంటూ ఆరోపించారు. ఇప్పుడు దోస్త్ ఎవరో, దుస్మాన్ ఎవరో అర్థమవుతుందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎంకి ఇచ్చినట్లే.. కాంగ్రెస్ కూడా భయపడి తమ చెయ్యిని కూడా ఎంఐఎం చేతికి ఇస్తుందని రాజాసింగ్ తెలిపారు. ఎందరో సీనియర్లు ఉన్న ఆయనే ఎందుకు ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, టీడీపీ ఉన్న రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ల కాళ్లు మొక్కి నెత్తి మీద కూర్చోడానికి ప్రయత్నిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ మనిషి అని, టిల్లు అని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎందే రాజ్యం నడుస్తుందని రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు.