విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలోని జాతిపిత మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో స్వామీ వివేకానంద జయంతిని తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావు మాట్లాడుతూ.. దేశ ఘనతను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహనీయుడు స్వామీ వివేకానందన్నారు. ముందుగా వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలతో నివాళులర్పించారు.