»Madhya Pradesh Unnatural Sex With Wife Is Not Rape
Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు
భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. భర్త తనతో చాలాసార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడని ఓ మహిళ కేసు పెట్టింది. దీంతో కోర్టు అసహజ శృంగారం అత్యాచారం కాదని తీర్పునిచ్చింది
Madhya pradesh: Unnatural sex with wife is not rape
Madhya pradesh: భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. భర్త తనతో చాలాసార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడని ఓ మహిళ కేసు పెట్టింది. దీంతో అతని భర్త ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. 2019లో ఆ దంపతులకు వివాహం జరిగింది. 2020 నుంచి భార్య వాళ్ల తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుందని భర్త అన్నాడు. అలాగే వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టిందని ఆ వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఇది గడిచిన రెండేళ్ల తర్వాత 2022లో తన భర్త అసహజ శృంగారానికి పాల్పడ్డారని ఆరోపిస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ కేసు విచారణకు రాగా సెక్షన్ 377 ప్రకారం భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని తెలిపింది. వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం పదిహేనేళ్లు నిండిన భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదన్నారు. తనతో పాటు ఉంటున్న భార్యతో అసహజ శృంగారం నేరం కాదు. కానీ సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని తెలిపారు.