»Andhra Pradesh Ec Expressed Outrage Over The Incidents Of Violence
Andhra Pradesh: హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ
పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Andhra Pradesh: EC expressed outrage over the incidents of violence
Andhra Pradesh: పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ సమన్లు పంపింది. ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ తర్వాత కూడా హింసాత్మక ఘటనలపై అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని.. ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా స్వయంగా తెలిపినట్లు సమాచారం.
పోలింగ్ తర్వాత తాడిపత్రి, తిరుపతి, కారంపూడిలో గొడవలు అయ్యాయి. శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణంలో వైసీపీ నాయకులు గొడవలకు పాల్పడ్డారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. అలాగే కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నేల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఎవరో రాయి వేశారని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాడిప్రతిలో వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో పట్టణ సీఐ మురళీకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. వీటిన్నింటిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.