అనుష్క పెళ్లి అనగానే ముందుగా అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్‌లో చాలా సార్లు అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసేశారు. కానీ ఈ ఇద్దరి మధ్య అలాంటిదేం లేదని చెబుతునే ఉన్నారు. అయితే ఇప్పుడు అనుష్క ఓ నిర్మాతతో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Anushka: Not Prabhas.. Anushka marriage with producer?
Anushka Shetty: మొదటిసారి బిల్లా సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క.. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.. అంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఇప్పటివరకు ఈ వార్తలన్నీ కేవలం పుకార్లుగానే ఉన్నాయి. ప్రభాస్, అనుష్క్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ వార్తలను కొట్టిపారేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించింది.
చివరగా నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఓ మళయాళ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. కానీ అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి ఆ మధ్యన అనుష్క ఓ స్టార్ క్రికెటర్‌తో పెళ్లికి రెడీ అయిందనే టాక్ నడిచింది. కానీ తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయమై చర్చ మొదలైంది. ప్రస్తుతం అనుష్క వయస్సు 42 ఏళ్లు. దీంతో ఈసారి పెళ్లి పీఠలెక్కడం పక్కా అని అంటున్నారు.
తాజా అప్టేట్ ప్రకారం ఈ బొద్దుగుమ్మ ఓ కన్నడ సినీ నిర్మాతను వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. అనుష్క కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్‌లో భాగంగా.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో.. ఇప్పుడు నిజంగా అనుష్క పెళ్లి పీటలెక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా.. త్వరలోనే అనుష్క తన పెళ్లి కబురు చెప్పనుందని అంటున్నారు. మరి అనుష్క ఈ విషయంలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.