»Anushkas Shocking Look Is This What She Has Done For So Many Days
Anushka Shetty: అనుష్క షాకింగ్ లుక్.. ఇన్ని రోజులు చేసింది ఇదేనా?
చివరగా 'మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. అయితే.. ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవలేదు స్వీటి. కానీ తాజాగా కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయింది.
Anushka's shocking look.. Is this what she has done for so many days?
Anushka Shetty: గత కొన్నాళ్లుగా కెమెరాకు కనిపించకుండా తిరుగుతోంది అనుష్క. ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఎక్కడా బయట కనిపించలేదు. అలాగే.. ఈ సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అవలేదు స్వీటి. దానికి కారణం అనుష్క లావుగా ఉండడమే అని టాక్ నడిచింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క.. మళ్లీ వెయిట్ లాస్ అయ్యేందుకు గట్టిగా కష్టపడింది. అప్పటి నుంచే అనుష్కకు వెయిట్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో బయట ఎక్కడ కూడా కనిపించకుండా పోయింది స్వీటి. అయితే.. తాజాగా అనుష్క ఓ కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలోనే అనుష్క ‘కథనార్’ అనే మలయాళం సినిమాకు కమిట్ అయింది.
కానీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. ఫైనల్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అందులో అనుష్క కూడా జాయిన్ అయింది. చిత్ర యూనిట్‌తో కలిసి ఉన్న అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అనుష్క స్లిమ్ లుక్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. స్వీటి చాలా సన్నబడ్డట్టుగా కనిపిస్తోంది. దీంతో.. అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్స్ చేసిందా? అని అంటున్నారు నెటిజన్స్. ఇక దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కించనున్న కథనార్ సినిమా ఏడు భాషల్లో రానుంది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్‌కే రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌మీద రాని థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో అనుష్క నెగిటివ్ రోల్ పోషిస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ఓ సినిమా చేస్తుందని సమాచారం. క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే.