»Low Rating For Gami Will Take Legal Action Vishwak Sen
Vishwak Sen: గామికు కావాలనే తక్కువ రేటింగ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి. థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు కావాలనే తక్కువ రేటింగ్‌లు ఇస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ పోస్ట్ పెట్టాడు.
Low rating for Gami.. Will take legal action.. Vishwak Sen
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన తాజా చిత్రం గామి(Gami). తన జోనర్ దాటి మొదటి సారి ప్రయోగం చేశారు. ఈ సినిమాలో ఆఘోరాగా నటించి విమర్షకుల చేత ప్రశంసలు అందుకున్నారు. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే కొందరు కావాలనే ఈ మూవీకి తక్కవ రేటింగ్ ఇస్తన్నారంటూ విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
గామి చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన సినిమా ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్న ఈ చిత్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ.. తక్కువ రేటింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. కావాలనే 10 కి 1 రేటింగ్ ఇస్తున్నారు. రకరకాల యాప్ప్ వాడి బుక్‌మై షో, తదితర ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న 9 రేటింగ్‌ను 1కి తీసుకొస్తున్నారు. ఎన్ని సార్లు పడగొట్టాలని చూసినా పైకి లేస్తూనే ఉంటా, ఇదంత ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఒక మంచి కంటెంట్ ఎప్పుడు వచ్చినా ఆదరిస్తారని రుజువైంది. ఇక ఇలా కావాలనే సినిమాను పడగొట్టాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని ఆయన పోస్టులో తెలియజేశారు.