KNR: సింగరేణి ఆర్జీ 3 జీఎంగా సుంకరి మధుసూదన్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. సింగరేణి రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంగా విధులు నిర్వహించిన ఆయనకు ఆర్జీ 3 జీఎంగా యాజమాన్యం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు నూతన జీఎంకు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీఎం మాట్లాడుతూ.. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలన్నారు.