»Actress Jayalalitha Sarathbabu And I Wanted To Have A Child
Actress Jayalalitha: నేను శరత్‌బాబు బిడ్డను కనాలనుకున్నాం
ఒకప్పుడు హీరోయిన్గా, నటిగా జయలలిత మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఎక్కువగా సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వూలో తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
Actress Jayalalitha: ఒకప్పుడు హీరోయిన్గా, నటిగా జయలలిత మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె ఎక్కువగా సీరియల్స్‌లో నటిస్తోంది. బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ జయలలిత చేశారు. అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వూలో తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. దివంగత నటుడు శరత్ బాబుతో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపారు. జయలలిత కోసం శరత్‌బాబు రోజూ ఒక వైన్ బాటిల్ తెప్పించేవారట. దాని ఖరీదు రూ.800. దీనికి ఎవరికి ఇచ్చేవారు కాదు. కనీసం ముట్టుకోనిచ్చేవారు కాదని జయలలిత తెలిపారు.
జయలలిత శరత్‌బాబుతో కలిసి చాలా తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. నాలుగు సంవత్సరాలు ఇద్దరం కలిసి జర్నీ చేశారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కూడా కనాలనుకున్నారు. అయితే ఈ విషయాన్ని సినిమా ఇండస్ట్రీలోని వాళ్ల స్నేహితులకు చెప్పగా. వాళ్లు శరత్‌బాబుకు వద్దని చెప్పారట. దీంతో పెళ్లి ఆగిపోయిందని జయలలిత అన్నారు. ఆయన చివరి రోజుల్లో ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్లేవారు. కానీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కూడా ఆమెకు దగ్గలేదని జయలలిత చాలా బాధపడ్డారు. అటు వైపుగా వెళ్తూ ఇప్పుడు ఆ ఇంటిని చూస్తే ఏడుపు వస్తుందని జయలలిత ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు అతను లేరు కాబట్టి ఈ విషయాన్ని చెప్పానని జయలలిత అన్నారు.