»Latest Bulletin Released On Actor Sarath Babus Health
Sarath Babu: ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల
శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది.
సీనియర్ నటుడు శరత్ బాబు(Actor Sarath babu) తీవ్ర అనారోగ్యం(Health Issue)తో ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital)లో ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. కమల్ హాసన్(Kamal hasan) వంటి స్టార్ హీరో సైతం సోషల్ మీడియాలోని ప్రచారాన్ని నమ్మి సంతాపం తెలిపారు. ఆ తర్వాత తన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
తాజాగా ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసింది. శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ వెంటిలేటర్ పైనే ఆయన్ని ఉంచి వైద్యం అందిస్తున్నట్లు ఏఐజీ ఆస్పత్రి తెలిపింది.
శరత్ బాబు(Actor Sarath babu) ఆరోగ్యంపై ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని, ఆస్పత్రి వర్గాలుకానీ, శరత్ బాబు కుటుంబీకులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడిస్తుంటామని ఏఐజీ ఆస్పత్రి(Hyderabad AIG Hospital) యాజమాన్యం స్పష్టం చేసింది. మరో 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడే అవకాశం ఉందని, వైద్యం చేయడానికి ఆయన శరీరం సహకరిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు.