టాలీవుడ్(Tollywood)లోకి దేవదాసు చిత్రం(Devadaasu Movie)తో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా(Ileana) ఒకప్పుడు టాప్ హీరోయిన్గా నిలిచింది. స్టార్ హీరోలు, యువ నటులు ఆమెతో నటించేందుకు, ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగు తెరపై తన గ్లామర్ షోస్ పండిస్తూ వచ్చిన ఇలియానా కుర్రాళ్ల మనసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అయితే టాలీవుడ్లో ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ (Bollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇలియానా షేర్ చేసిన వీడియో:
బాలీవుడ్ (Bollywood)లో ఇలియానా(Ileana)కు అనుకున్నంత సక్సెస్ రాలేదు. అయినప్పటికీ కెరీర్ ను నెట్టుకొస్తోన్న ఇలియానా తాను తల్లి కాబోతున్నానని షాక్ ఇచ్చింది. మొదట ఆమె తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. రెండు వారాలకు ముందు ఆమె ఒక చిన్నారి డ్రెస్సును, మెడలో మమా అని రాసి ఉండే లాకెట్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. అయితే ఆమె పోస్ట్ ను చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు.
మొదటిసారి బేబీ బంప్ (Baby Bump)తో ఉన్న వీడియో(Video)ను తన ఇన్‌స్టాలో ఇలియానా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలియానా(Ileana)కు ఇంకా పెళ్లి కాకపోయినన్పటికీ ఆమె తల్లి ఎలా అయ్యిందంటూ కొందరు, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత 2019లో ఆమె అతని నుంచి విడిపోయింది. ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే వారి బంధం గురించి ఇలియానా మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.