W.G: నరసాపురంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల మీదుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం YSR విగ్రహానికి పూలమాలలు వేసారు.