గత కొన్నాళ్లుగా కొత్త సినిమాలు చేయడం లేదు స్వీటి అనుష్క. 'మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి' సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలైతే చేస్తోంది. అయితే.. అనుష్కకు ఒక విచిత్రమైన వ్యాధి ఉన్నట్టుగా తెలిసింది.
Anushka has a strange disease.. If you know, you will laugh!
Anushka Shetty: చివరగా ‘మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. అయితే.. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కమిట్ అవలేదు స్వీటి. అసలు బాహుబలి తర్వాత ‘సైజ్ జీరో’ సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క.. మళ్లీ వెయిట్ లాస్ అయ్యేందుకు గట్టిగా కష్టపడింది. అప్పటి నుంచే అనుష్కకు వెయిట్ కష్టాలు మొదలయ్యాయి. అయితే.. రీసెంట్గా అనుష్క’కథనార్’ అనే మలయాళం సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన ఫోటోల్లో స్వీటీ చాలా స్లిమ్‌గా కనిపించించింది. అలాగే.. వేదం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు ‘ఘాతి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ అమెజాన్‌లో రాబోతున్నట్టుగా వెల్లడించారు. లేడీ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా రాబోతోంది. మరోసారి అనుష్క వేశ్యగా కనిపించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
గతంలో వేదం సినిమాలో అనుష్కను వేశ్యగా చూపించాడు క్రిష్. ఇక ఇప్పుడు మరోసారి వేశ్య పాత్రతో సినిమా చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుష్క అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే.. అనుష్కకు ఉన్న వ్యాధి చాలా విచిత్రమైనదే అని చెప్పాలి. అదేంటంటే.. ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట అనుష్క. ఎలాంటి జోక్స్ విన్న సరే.. పగలబడి నవ్వుతుందట. దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను.. అని చెప్పుకొచ్చింది. ఇది పెద్ద సమస్య కాకపోయినా.. తనకు చాలా త్వరగా నవ్వొస్తుందని.. దాన్ని కంట్రోల్ చేయలేనని.. అందుకే ఇది కూడా ఓ వ్యాధి లాంటిదే అని అనుష్క చెప్పడం విశేషం.