»Official This Is The Story Of Kalki Three Hours Three New Worlds
Kalki: అఫీషియల్.. కల్కి కథ ఇదే, మూడు గంటలు, మూడు కొత్త ప్రపంచాలు!
ఇన్ని రోజులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. వచ్చే గురువారం వరకు వెయిట్ చేస్తే చాలు.. కల్కి గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేయనుంది. ఓ రోజు ముందే ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. కానీ వారం ముందే కథ మొత్తం చెప్పేశాడు నాగ్ అశ్విన్.
Kalki: ఓవర్సీస్లో ముందు రోజు ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి కాబట్టి.. అక్కడక రివ్యూలు కాస్త ముందే రానున్నాయి. అయినా.. ఫస్డ్ డే కాదు, వీకెండ్ వరకు ప్రభాస్ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లకు క్యూ కడతారు జనాలు. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి రావడం పక్కా. అసలే సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి రెడీ అవుతోంది కల్కి. ఇప్పటికే కథ గురించి చెబుతూ వస్తున్నాడు నాగ్ అశ్విన్. కల్కి కథ గురించి చెబుతూ.. ఫ్యూచర్ ఈజ్ నౌ పేరుతో ఒక్కో ఎపిసోడ్ అంటూ.. సెకండ్ ఎపిసోడ్లో కథ మొత్తం నాలుగు నిమిషాల్లోనే చెప్పేశాడు నాగి. కల్కి కథ మొత్తం కాశీ, కాంప్లెక్స్, శంబాలా ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని.. అందుకోసం కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు కొత్త ప్రపంచాలను సృష్టించామని చెప్పాడు. ప్రపంచంలో చివరి నగరం కాశీ క్రమేపీ దుర్భర నివాస ప్రాంతంగా మారిపోతే ఎలా ఉంటుంది? అదే నగరం పైన ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే మరో ప్రపంచం కాంప్లెక్స్ ఉండడం..
అక్కడ అన్ని వసతులు ఉండడం.. అక్కడికి వెళ్లడానికి కాశీ వాసులు ఏం చేశారు.. ఈ రెండూ కాకుండా మూడో ప్రపంచం శంబాలాతో కల్కికి ఉన్న లింక్ ఏంటి? మొత్తంగా.. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే యుద్ధమే కల్కి కథ.. అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. నాగి చెప్పిన దాని ప్రకారం.. కల్కి మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. తాను ఊహించినట్టుగా తెరపై చూపించగలిగితే.. నాగి సక్సెస్ అయినట్టే. అదే జరిగితే.. వెండితెరపై మూడు గంటల పాటు మనం అద్భుతం చూడబోతున్నట్టే. ఎందుకంటే.. ఈ సినిమా అఫీషియల్ రన్ టైం బయటికొచ్చేసింది. నిన్నటి వరకు రెండు గంటల 55 నిమిషాల రన్ టైం లాక్ అయినట్టుగా వార్తలు రాగా.. ఇప్పుడు 180.56 నిమిషాల నిడివితో రానున్నట్లు తెలిసింది. అంటే, కల్కి రన్ టైం వచ్చేసి మూడు గంటల 56 సెకండ్లు అన్నమాట. ఇక ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిన సంగతి తెలిసిందే.