»Leaked Second Trailer Of Kalki Watching The Fights Makes Me Crazy
Kalki: లీకైన కల్కి సెకండ్ ట్రైలర్.. ఫైట్స్ చూస్తే మతిపోతోంది.
సోషల్ మీడియాలో సెకండ్ ట్రైలర్ వైరల్ అవుతుంది. ఈ వీడియోల్లో విజువల్స్ మాములుగా లేవు. ఫస్ట్ ట్రైలర్లో చూపించని సీన్లు, క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించింది.
Leaked second trailer of Kalki.. Watching the fights makes me crazy.
Kalki: పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ స్టోరీపై ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ ఇచ్చినా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె సహా నిర్మాత అశ్వినీదత్ అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకు కల్కి సెకండ్ ట్రైలర్‌ను ప్రదర్శించారు. అది బయటకు లీక్ అవకుండా మీడియా వాళ్లను ఫోన్లు, కెమెరాలను తీసుకెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అయినా సరే ట్రైలర్ బయటకు వచ్చేసింది.
సోషల్ మీడియాలో సెకండ్ ట్రైలర్ వైరల్ అవుతుంది. ఈ వీడియోల్లో విజువల్స్ మాములుగా లేవు. ఫస్ట్ ట్రైలర్లో చూపించని సీన్లు, క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించింది. మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్ ఉన్నాయి. అంటే ఈ సీన్ చూస్తుంటే మృణాల్ మహాభారతంలోని ఉత్తర పాత్రలో కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. అశ్వత్థామ తాను సంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఇది కచ్చితంగా అదే సీన్ అని నెటిజన్లు భావిస్తున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సెకండ్ ట్రైలర్లో అశ్వత్థామ-భైరవ మధ్య పోరాట సన్నివేశాలు బలంగా చూపించారు. వీళ్ల మధ్య భారీ యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అలాగే కమల్ హాసన్, దీపిక పదుకొణె సీన్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ ట్రైలర్ ఫస్ట్ దానికంటే అద్భుతంగా ఉంది. అయితే అది అల్రెడీ నెట్టింట్లో వైరల్ అవుతుంది కాబట్టి మేకర్స్ వీలైనంత త్వరగా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా ప్రభాస్ కెరియర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.