Mrinal Thakur: బంపర్ ఆఫర్.. పాన్ ఇండియా స్టార్‌తో మృణాల్?
ప్రస్తుతం టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. సీతారామం సినిమాలో తన అందంతో తెలుగు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది అమ్మడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది.
Mrinal Thakur: సీతారామం సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో ఇటీవలె ప్రేక్షకుల ముందుకొచ్చింది మృణాల్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక హాయ్ నాన్న తర్వాత త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది మృణాల్. ఇలా సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా ఆచితూచి అడుగులేస్తోంది అమ్మడు. ఈ నేపథ్యంలో మృణాల్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మే 9న రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత సలార్ 2తో పాటు.. రాజాసాబ్ కంప్లీట్ చేయనున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ వెంటనే హనురాఘవపూడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా విశాల్ చంద్రశేఖర్ ఫిక్స్ అయిపోయాడు. మ్యూజిక్ సిట్టింగ్ కూడా మొదలైనట్టుగా సమాచారం. అయితే.. హీరోయిన్ విషయంలో మాత్రం వార్తలు వస్తునే ఉన్నాయి. గతంలో ప్రభాస్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్గా అనుకుంటున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు మృణాల్ దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్‌కు సాలిడ్ బ్రేక్ ఇచ్చాడు హను రాఘవపూడి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌తో ఛాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. అందుకే.. ప్రభాస్ సరసన మృణాల్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.