»Sai Pallavi Sai Pallavi With An Unexpected Hero And Romance
Sai Pallavi: ఊహించని హీరోతో సాయి పల్లవి? మరి రొమాన్స్?
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో రామాయణం సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఒక ఊహించని హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Sai Pallavi: Sai Pallavi with an unexpected hero? And romance?
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్‌కు దూరంగా ఉంటూ, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంటుంది. రొమాన్స్, లిప్ లాక్స్‌కు దూరంగా ఉంటు వస్తోంది. ఒకవేళ కాదు, కూడదు అంటే, ఎంత పెద్ద హీరో సినిమా అయిన సరే రిజెక్ట్ చేస్తుందనే టాక్ ఉంది. కానీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో సాయి పల్లవి ఓకె అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రౌడీ.. రాజావారు రాణిగారు డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. దీంతో.. హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నట్టుగా సమాచారం.
సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు కరెక్ట్‌గా ఉంటుందని.. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో.. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫిదా, ఎంసీఏ సినిమాల్లో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. కాబట్టి తన పాత్ర నచ్చితే సాయి పల్లవిని ఓకె చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌కు ఓకె చెబితే, రొమాన్స్ సీన్స్ మాత్రం ఉండే ఛాన్స్ ఉండదు. పైగా రౌడీ హీరో విజయ్ దేవర కొండకు యూత్‌లో యమా క్రేజ్ ఉంది.
యూత్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ డిజైన్ చేసుకుంటు ఉంటారు మేకర్స్. హీరోయిన్లు కూడా విజయ్‌తో రొమాన్స్ చేయడానికి సై అంటుంటారు. కానీ సాయి పల్లవితో మాత్రం ఇలాంటి ఉండవు. అందుకే.. ఫ్యామిలీ స్టార్‌లో సాయి పల్లవిని రౌడీ వద్దన్నాడనే టాక్ ఉంది. కానీ ఈసారి విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబో సెట్ అయితే మాత్రం.. ఇది క్రేజీ కాంబో అనే చెప్పాలి.