»Prabhas Kannappa How Much Is Prabhas Remuneration
Prabhas: కన్నప్ప.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత?
ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా, పాన్ ఇండియా బాస్‌గా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. మరి గెస్ట్ రోల్‌గా చేస్తున్న కన్నప్ప కోసం ఎంత తీసుకుంటున్నాడు?
Prabhas: Kannappa.. How much is Prabhas' remuneration?
Prabhas: ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జూన్ 27న రిలీజ్ కానున్న కల్కి 2898ఏడి ఏకంగా 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సలార్ 2, రాజాసాబ్, స్పిరిట్ కూడా భారీ బడ్జెట్‌తో రానున్నాయి. ఇక ఈ సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ వంద కోట్లకు పైగానే ఉంటుంది. ఒక్కో సినిమాను బట్టి.. 120 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు. అలాంటి ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే, ఆ సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు.
నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు కన్నప్ప సినిమాకు రాని హైప్.. జస్ట్ ప్రభాస్ అలా షూటింగ్లో జాయిన్ అయ్యాడనే వార్తతో పాన్ ఇండియా బజ్ జనరేట్ అయింది. ప్రభాస్ కాలితో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి సూపర్ హైప్ క్రియేట్ చేసిన విష్ణు. ఇదే జోష్‌లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మే 20న రిలీజ్ కానున్న ఈ టీజర్లో జస్ట్ ప్రభాస్‌కు సంబందించిన కొన్ని షార్ట్స్ పడితే.. పాన్ ఇండియా షేక్ అవడం గ్యారెంటీ. మరి ఇంత హైప్ జనరేట్ చేసిన ప్రభాస్‌కు.. కన్నప్ప రెమ్యునరేషన్ ఎంత? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. కన్నప్పలో నటిస్తున్నందుకు ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడని అంటున్నారు. కానీ.. ఇతర కమిట్మెంట్స్ కారణంగా, చాలా తక్కువ రోజులు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కల్కి ప్రమోషన్స్‌లో పాల్గొననున్న ప్రభాస్.. ఆ తర్వాత సలార్ 2 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. ఏదేమైనా.. కన్నప్పలో ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.