ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
AP DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది. మళ్లీ ఈసీ ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. డీజీపీని నియమించేందుకు ముగ్గురు పేర్లుతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియర్ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు(ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్‌కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేశారు. ఇందులో 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.