»Ssmb 28 Good News Mahesh Babu 8 Getups For Rajamouli
SSMB 28: గుడ్ న్యూస్.. రాజమౌళి కోసం మహేష్ బాబు 8 గెటప్స్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
SSMB 28: అదిగో, ఇదిగో అనడమే తప్ప.. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావడం లేదు. కానీ ఎప్పుడొచ్చిన అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబు బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పట్లో మహేష్ బాబు బయట కనిపించే అవకాశాలు లేవు. మహేష్ నయా లుక్‌ను చూడాలంటే సినిమా ఓపెనింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. మహేశ్ బాబు లుక్ టెస్ట్ పూర్తయిందని తెలుస్తోంది. మొత్తం ఎనిమిది లుక్స్‌ను రాజమౌళి టీమ్ రెడీ చేసిందట. కథకు సరిపోయేలా మహేష్‌ను టెస్ట్ ఫొటో షూట్ చేశారట.
అయితే.. ఫైనల్ లుక్ డిసిషన్ ఇంకా రాజమౌళి దగ్గరే పెండింగ్ ఉందట. జక్కన్న ఎనిమిది లుక్స్‌లో ఫైనల్ చేసేస్తే.. నెక్స్ట్ సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అంటున్నారు. అలాగే.. ఈ సినిమా ఓపెనింగ్ రోజే మహేష్ బాబు కొత్త లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం మహేష్ బాబు బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే.. మహేష్ ఇటీవల ఎక్కువ పబ్లిక్‌గా కనిపించడం లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను భారీగా లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
దాదాపుగా తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ రోజున, ఏప్రిల్ 9న ఈ మూవీని అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. లేదంటే.. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే నాడు ఓపెనింగ్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఏడాదిలోనే ఈ భారీ ప్రాజెక్ట్ మొదలు పెట్టేలా కసరత్తులు చేస్తున్నాడు రాజమౌళి. ఏదేమైనా.. ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ లుక్ ఎలా ఉంటుందనేది ఎగ్జైటింగ్‌గా మారింది.