»Anasuya And Sekhar Master Anasuya And Sekhar Master In The New Game Show Netizens Are Cursing
Anasuya and Sekhar Master: సరికొత్త గేమ్ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!
సెలబ్రిటీలు తరచుగా కొన్ని కార్యక్రమాల్లో అతి చేస్తూ ఉంటారు. వివాదాలు చెలరేగే రియాల్టీ షోలలో ఇది సాధారణంగా జరుగుతుంది. వారు తమ చర్యలకు ట్రోలింగ్ బారిన కూడా పడుతూ ఉంటారు. ఇప్పుడు, అనసూయ, టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, శేఖర్ మాస్టర్ వివాదంలో భాగమయ్యారు. వారిద్దరూ కూడా ఒక కారణంతో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆ వివరాలేంటో చూద్దాం.
Anasuya and Sekhar Master: Anasuya and Sekhar Master in the new game show.. Netizens are cursing..!
Anasuya and Sekhar Master : స్టార్ మాలో గతవారం వరకు నీతోనే డ్యాన్స్ 2.0 వచ్చిన విషయం తెలిసిందే. ఈ షో రీసెంట్ గా ముగియడంతో.. మరో కొత్త గేమ్ షో మొదలుపెట్టారు. సెలబ్రటీ గేమ్ షోలో శేఖర్ మాస్టర్, అనసూయ కూడా పాల్గొంటున్నారు. అయితే.. దీనికి సంబంధించిన కొత్త ప్రోమో విడుదల చేయగా.. అందులో అనసూయ, శేఖర్ మాస్టర్ ప్రవర్తన అందరినీ విసిగించడం విశేషం. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
స్టార్ మాలో ఓ రియాల్టీ షోలో యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పాల్గొంది. శేఖర్ మాస్టర్ కూడా ఈ షోలో భాగమయ్యారు. ఇద్దరూ వివాదాస్పదంగా మారిన ప్రోమోలో వారిద్దరూ దుస్తులు తీయడం గమనార్హం. అందరూ చూసే టీవీ షోలో పరిమితులు దాటి ప్రవర్తించినందుకు ఇద్దరినీ ట్రోల్ చేశారు. స్టార్ మా మేనేజ్మెంట్ కొత్తగా ప్రారంభించిన ఈ షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో ఉంది.
సెలబ్రిటీలు టీవీ షోలో అసభ్యత హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షోలో ఇలా జరగడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. బిగ్ బాస్ కూడా.. ఎప్పటికప్పుడు ఇలాంటి వివాదాలు తీసుకువస్తూనే ఉంటుంది. తాజాగా ఈ కొత్త షోలో శేఖర్ మాస్టర్, అనసూయ దుస్తులు విప్పడం, చాలా మంది అమ్మాయిలు శేఖర్ మాస్టర్ ని ఎత్తుకోవడం, ముద్దులుపెట్టడం లాంటివి చేయడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.