Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ను ఓ రేంజ్లో అడుకుంటున్నారుగా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్స్. దారుణాతి దారుణమైన కామెంట్స్‌తో ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ.. ఫ్యామిలీ స్టార్‌ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.
Family Star: భారీ అంచనాల మధ్య వచ్చిన విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దిల్ రాజు నిర్మాణంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. కాస్త ముందుగానే ఓటిటిలోకి వచ్చేయడంతో.. ఓటిటిలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఫ్యామిలీ స్టార్. థియేటర్లలో ఈ మూవీని చూడని వాళ్లు ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు. అయినా కూడా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.
ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని సీన్లపై ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు ఓటిటి విషయంలో కూడా అదే జరుగుతోంది. సినిమాలోని కొన్ని సీన్ల గురించి చెబుతూ.. మరీ సిల్లీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రవిబాబుకు విజయ్ ఇచ్చే వార్నింగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే.. నానమ్మను ఇలా కూడా అంటారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. లుంగీ గెటప్‌లో విజయ్ ఎంట్రీ సీన్‌పై అయితే దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే.. ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చలేదని అంటున్నారు. దీంతో.. తొలిరోజు థియేటర్లలో రిలీజైనప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఇప్పుడు ఓటిటిలోనూ అలాగే వస్తోంది. అయితే.. కొందరు మాత్రం ఈ సినిమా బాగానే ఉందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ పెయిర్ బాగుందని అంటున్నారు. ప్రస్తుతానికి ట్రోలింగ్ జరుగుతున్న కూడా.. ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్తోనే దూసుకుపోతోంది ఫ్యామిలీ స్టార్.