NLR: గుడ్లూరు ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానిక సమాచారం మేరకు… ఈ బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న ఒక లారీ ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆటో వద్ద నిలబడి ఉన్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఓ మహిళ చికిత్స పొందుతూ మరణించింది. మరో మహిళా వైద్యం పొందుతున్నారు.