‘కిష్కింధపురి’ సినిమాలో హారర్, థ్రిల్లింగ్ అంశాలు కొత్తగా ఉంటాయని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. కథలో అరగంట కామెడీ తర్వాత ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథ సాగుతుందని అన్నారు. అనుపమ పాత్ర చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని వెల్లడించారు. ఓ నిర్మాత కొడుకుగా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఏం నేర్చుకున్నావని ఎవరైనా అడిగితే ‘కిష్కింధపురి’ సినిమాని చూపిస్తానని అన్నారు.