కేజీయఫ్ సిరీస్‌తో సాలిడ్ హిట్స్ కొట్టి పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్. కెజియఫ్ తర్వాత టాక్సిక్ సినిమా చేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో.. రావణుడిగా నటించేందుకు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం.
Yash: 'Yash' shocking decision as Ravana? 20 kg at once?
Yash: కేజీయఫ్ సినిమతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన యష్.. కాస్త గ్యాప్ తీసుకొని, ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యశ్ 19వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత యష్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. కానీ గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ రామాయాణలో రావణుడిగా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తునే ఉన్నాయి.
రాముడిగా రణబీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమాకు యష్ నిర్మాణ భాగస్వామిగా మాత్రమే ఉంటున్నాడు.. రావణుడిగా నటించట్లేదు అనే టాక్ వినిపించింది. మేకర్స్ కూడా దీని పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రావణాసురుడిగా రెడీ అవుతున్నాడట యష్. అంతేకాదు.. రావణుడి పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకోసం యష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.
ఏకంగా 20 కిలోల బరువు పెరగనున్నాడట. రావణుడిగా కనిపించాలంటే శారీరకంగా మరింత భారీగా, బలంగా ఉండాలి. అందుకే.. వెయిట్ పెరుగుతున్నాడని అంటున్నారు. అయితే.. ఒకేసారి 20 కిలోల వెయిట్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అయినా కూడా యష్ మాత్రం వెయిట్ పెరుగుతున్నాడని టాక్. టాక్సిక్ సినిమా షూటింగ్ పూర్తవగానే ‘రామాయణ’ సెట్లోకి అడుగుపెట్టబోతున్నాడట యష్. మరి యష్ రావణుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.