»Ramayana Yashs Ravana Outfits Be Made With Real Gold
Ramayana Movie : యశ్.. రావణుడి పాత్ర కోసం నిజమైన బంగారు నగలు, దుస్తులు?
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ కోసం నిజమైన బంగారంతో నగలు, దుస్తులు తయారు చేయిస్తున్నారన్న వార్త హల్చల్ చేస్తోంది. ఎందుకంటే?
Ramayana Movie Yash : ‘రామాయణ’ చిత్రంలో రావణుడికి నిజమైన బంగారు నగలు, బంగారంతో నేసిన దుస్తుల్ని షూటింగ్ కోసం వాడనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు మూవీ మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారట. రావణుడి పాత్రను ‘యశ్’ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రావణుడు అంటే స్వర్ణ నగరం లంకాపురికి రాజు. అందుకనే అప్పట్లో ఆయన అన్నీ అలాంటి బంగారు వస్త్రాలనే ధరించేవారని ఇతిహాసాల్లో ఉంది.
నిజమైన రావణుడికి లాగానే ఎలాంటి డీటైలింగ్ మిస్ కాకూడదని రామాయణ (RAMAYANA)మూవీ టీం భావిస్తోందట. అందుకనే అప్పటి రావణుడి లాగానే బంగారు నగలు, బంగారంతో చేసిన వస్త్రాలు యశ్ కూడా వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ వార్త విన్న సదరు సినిమా ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాకుండా మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యశ్(YASH) రావణుడి పాత్ర వేయడమే కాదు.. ఈ సినిమా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.835 కోట్లని బీటౌన్‌లోనూ, నెట్లోనూ టాక్ నడుస్తోంది. ఇదంతా మొదటి పార్ట్‌ని తెరకెక్కించడానికే వాడనున్నారట. తొలుత ఈ సినిమా 2025లో విడుదల అవుతుందని వార్తలు వచ్చాయిగానీ ఇప్పుడు 2027లోనే విడుదల అని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.