యష్ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'టాక్సిక్' పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఫైనల్‌గా స్టార్ హీరోయిన్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరు?
Toxic: కెజియఫ్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సినిమా టాక్సిస్. గీతూ మొహన్దాస్ దర్శకత్వంలో.. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. KVN ప్రొడక్షన్స్ యష్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్: ఛాప్టర్ 2 తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
నిన్న మొన్నటి వరకు కరీనా కపూర్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని సమాచారం. స్టార్ బ్యూటీ కియారా అద్వానీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడట యష్. ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన కియారా.. ఆ తరువాత రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’లో నటించింది. ప్రస్తుతం మరోసారి చరణ్‌తో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తోంది. అలాగే.. బాలీవుడ్లో పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.
ఇక ఇప్పుడు యష్ ‘టాక్సిక్’ సినిమాలో ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. తన పాత్రను ఎంతో ఇష్టపడి, ఈ ప్రాజెక్టును సైన్ చేసిందట అమ్మడు. ఇక యష్ సోదరి పాత్రకు స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి ఇంత గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’.. యష్‌కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.