Double Ismart: ఫుల్ హ్యాపీ.. ‘డబుల్ ఇస్మార్ట్’కు సూపర్ రెస్పాన్స్!
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ చిత్రం డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన టీజర్ బాగుండడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఈ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Double Ismart: ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్.. అంటూ టీజర్‌తో రచ్చ రచ్చ చేశాడు రామ్ పోతినేని. తెలంగాణ స్లాంగ్‌లో తనదైన డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు రామ్. పక్కా పూరి మార్క్‌తో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రామ్ ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీ అవుతోంది. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ టీజర్.. ఫ్యాన్స్‌కు డబుల్ డోస్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్‌లో ఉన్న మాస్ డోస్‌కి డబుల్ మ్యాడ్ నెస్ ఈ టీజర్లో చూడొచ్చు.
ఈ టీజర్‌తో.. మాస్ ఆడియెన్స్ పండగ చేసుకునేలా సీక్వెల్ రాబోతోందని చెప్పేశాడు పూరి. దీంతో రామ్, పూరి ఈ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడం పక్కా అని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్, పూరి చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అందుకే.. డబుల్ ఇస్మార్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ క్రేజీ కాంబో కోసం ఆసక్తిగాఎదురు చూస్తున్నారు. అందుకే.. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. మొత్తంగా.. 24 గంటల్లో యూట్యూబ్‌లో 10.5 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టింది డబుల్ ఇస్మార్ట్ టీజర్.
ఇక అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో కలిపి 15 మిలియన్స్‌కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ.. రెస్పాన్స్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇక కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తునారు. మరి ఈ సినిమాతో రామ్, పూరి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.