summer dehydration drinks : వేసవి కాలంలో ఎంత నీరు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలను మనం గమనిస్తుంటాయి. అయితే ఈ సమయంలో నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు మరికొన్ని రీహైడ్రేషన్ డ్రింక్స్‌ని(drinks) తీసుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అవేంటంటే..
వేసవి కాలంలో(summer) కొబ్బరిబొండం నీరును వేసవి కాలం తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఈ నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. అలాగే చెరుకురసం, మజ్జిగ, లెమనేడ్, పుచ్చకాయ జ్యూస్, లాంటి వాటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. చెరుకు రసం లాంటి సహజ పానీయాల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.
ఇక తాగగలం అనుకున్న వారు అలోవెరా జ్యూస్, క్యారెట్ జ్యూస్, కీరా జ్యూస్ లాంటి వాటిని తప్పకుండా ప్రయత్నించవచ్చు. అయితే వీటిలో చక్కెరలు చేర్చుకోకూడదని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇవి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తాయి. సరైన శరీర ఉష్ణోగ్రత మెయింటెన్ అయ్యేలా చూస్తాయి. అందువల్ల మనం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడిపోకుండా ఉంటాం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు లాంటి వాటన్నింటినీ కలిపి రకరకాల స్మూతీలు(Smoothies) కూడా చేసుకుని తాగొచ్చు. ఇవి శరీరాన్ని తేమగా ఉంచడమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.