Summer Drinks : మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో బరువు తగ్గడం కొంత తేలికనే చెప్పాలి. చురుకైన జీవక్రియ, ఎక్కువగా పానీయాలు తాగడం లాంటి వాటి వల్ల ఈ కాలంలో బరువును వేగంగా తగ్గొచ్చు. చక్కెర నిండిన తియ్యటి పానీయాలకు బదులుగా కొన్ని మంచి డ్రింక్‌లను(Drinks) ఎంపిక చేసుకుని తాగుతూ ఉంటే అవి మనం బరువు తగ్గడానికి(weight loss) కూడా చక్కగా సహకరిస్తాయి. మార్కెట్లలో దొరికే శీతల పానీయాల్లాంటివి కాకుండా వీటిని చేసుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
మజ్జిగలో కాస్త నిమ్మరసం, జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు కలుపుకుని పల్చగా చేసుకోవాలి. కావాలనుకుంటే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చ. దీనిలో క్యాలరీలు తక్కువగా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గానూ ఉంచి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అలాగే పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా తాగుతున్నా బరువు తొందరగా తగ్గుతారు. పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి మెత్తగా ఉడబెట్టి ఆ గుజ్జులో పుదీనా, జీలకర్రపొడి, నల్ల ఉప్పు, కాస్త తేనె వేసి ఆమ్ పన్నాను సిద్ధం చేస్తారు.
ఆరోగ్యం కోసం చాలా మంది ప్రతి రోజూ నిమ్మరసం తాగుతుంటారు. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గ్లాసు నీటిలో తాజా నిమ్మరసం పిండి కొద్దిగా నల్ల ఉప్పు, పుదినా ఆకులు, తేనె వేసి కలుపుకోవాలి. ఇది తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నీరు, బార్లీ నీరు, జల్జీరా లాంటి వాటిని తాగడం వల్ల క్యాలరీలు ఎక్కువగా కరిగి బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సమయంలో అధిక క్యాలరీ ఫుడ్‌కి దూరంగా ఉంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది.