»Divorce A Wife Who Filed For Divorce From Her Husband Who Is A Gym Trainer Did Not Lose Weight
Divorce: జిమ్ ట్రైనర్ అయిన తన భర్త బరువు తగ్గించలేదని విడాకులు కోరిన భార్య
జిమ్ ట్రైనర్ అయిన తన భర్త బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులు కోరింది. ట్రైనర్ శరీరాకృతి చూసి నచ్చి గతేడాది అతడిని వివాహం చేసుకున్న ఆమె.. బరువు తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది.
Divorce: A wife who filed for divorce from her husband, who is a gym trainer, did not lose weight
Divorce: జిమ్ ట్రైనర్ అయిన తన భర్త బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులు కోరింది. ట్రైనర్ శరీరాకృతి చూసి నచ్చి గతేడాది అతడిని వివాహం చేసుకుంది. అలాగే తన బరువు కూడా తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది. దీనికి అతను కూడా అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు కొంచెం కూడా బరువు తగ్గించలేకపోవడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కానీ జిమ్ ట్రైనర్ మాత్రం భార్యతోనే ఉంటానని చెబుతున్నారు.
అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువతి జిమ్ ట్రైనర్‌ను చూసి ప్రేమలో పడింది. మంచి ఫిజిక్ ఉండటంతో అతనిని పెళ్లి చేసుకోడానికి సిద్ధపడింది. అలాగే పెళ్లికి ముందు ఓ కండిషన్ కూడా పెట్టింది. పెళ్లి తర్వాత తన బరువును తగ్గించాలని షరతు విధించింది. తన బరువుతను తగ్గిస్తానని జిమ్ ట్రైనర్ ఆమెకు మాట ఇచ్చాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాపురం కూడా చేస్తున్నారు. రోజులు వారాలు నెలలు గడిచాయి. కానీ ఆమె ఎంత కష్టపడి, ఎన్ని వర్కౌట్లు చేసినప్పటికి బరువు తగ్గలేదు. దీంతో భార్య భర్తపై మండిపడింది. తనకు ఇచ్చిన మాటతప్పినందుకు భర్తను విడాకులు కోరింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.