E.G: ఆత్మహత్యలకు దూరంగా ఉండి, జీవితాన్ని జయించాలని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అంతర్జాతీయ సభ్యుడు సుంకర నాగేంద్ర కిషోర్, స్పృహ మనస్తత్వవేత్త ఎస్.రాజేష్ ఖన్నా తెలిపారు. ఇందులో భాగంగా ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంలో వారు విద్యార్థులకు ఆత్మహత్య ధోరణుల మూలాలు, వాటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించారు.