Uday Kiran: ఇలాంటి సమయంలో.. ఉదయ్ కిరణ్ ఉండి ఉంటేనా?
ఇలాంటి సమయంలో ఉదయ్ కిరణ్ ఉండి ఉంటే.. మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే.. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ తాజాగా రీ రిలీజ్ అయింది. దీంతో ఉదయ్ కిరణ్‌ను మిస్ అవుతున్నారు అభిమానులు.
At a time like this... if Uday Kiran had been there?
Uday Kiran: ఉదయ్ కిరణ్ లేని లేటు.. టాలీవుడ్లో ఎప్పుటికీ పూడ్చలేనిదే. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీ ఓ మంచి హీరోని కోల్పోయిందని బాధపడుతునే ఉంది. లవర్ బాయ్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఉదయ్ కిరణ్.. అర్థంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఇలాంటి సమయంలో ఈ లవర్ బాయ్ ఉంటే.. ఆ లెక్క మరోలా ఉండేది. ఎందుకంటే.. లేటెస్ట్గా నువ్వు నేను సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌తో పాటు హీరోలు కూడా రీ రిలీజ్ విషయంలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం నువ్వు నేను సినిమా రీ రిలీజ్‌తో దుమ్ములేపుతున్నారు మూవీ లవర్స్. మార్చి 21న నువ్వునేను సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దీంతో అప్పట్లో ఈ సినిమా చూసి ఎలా అయితే ఎంజాయ్ చేశారో.. అలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ప్రస్తుతం థియేటర్స్‌లో ఈ సినిమాని ప్రేక్షకులు ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో గాజువాక పిల్ల సాంగ్‌కు థియేటర్ షేక్ అయిపోతోంది. ఈ సాంగ్ కు ఇప్పటికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడానికి ఇదే నిదర్శనం. నువ్వు నేను సినిమా రిలీజ్ అయి 23 ఏళ్లు కావొస్తోంది. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, అనిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.