»Harihara Viramallu Harahara Veeramallu Teaser Release Will Correct Everyones Calculations
Harihara Veeramallu: ‘హరహర వీరమల్లు’ టీజర్ రిలీజ్.. అందరి లెక్కలు సరి చేస్తాడు!
అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే.. హరిహర వీరమల్లు సినిమా ఈపాటికే రిలీజ్ అయి ఉండేది. కానీ అలా జరగలేదు. రోజు రోజుకి డిలే అవుతూ.. ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు మేకర్స్. ఫైనల్‌గా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.
Harihara Viramallu: 'Harahara Veeramallu' teaser release... will correct everyone's calculations!
Harihara Veeramallu: పవన్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే.. దర్శకుడు క్రిష్, పవన్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించాడు. పవన్ బందిపోటు లుక్కు ఫిదా అయిపోయారు. కానీ.. ఎందుకో ఈ సినిమా డిలే అవడం స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రకటించిన సినిమాల షూటింగ్ చేస్తున్నాడు.. కానీ వీరమల్లుని మాత్రం హోల్డ్‌లో పెట్టేశాడు పవన్. దీంతో.. ఇప్పట్లో ఈ సినిమా ఉండడదని అనుకున్నారు. ఎందుకంటే.. అన్ని సినిమాలను పక్కకు పెట్టి.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు పవన్. ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫైనల్‌గా ‘హరిహర వీరమల్లు’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. ‘మన ప్రాణానికి విలువే లేదా నాన్నా మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు’ అని ఓ చిన్నారి తండ్రిని అడిగే ప్రశ్నతో టీజర్ మొదలైంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో సామాన్యుల కష్ట దోపిడిని ఇందులో చూపించారు. ‘ప్రతి వాడిని పైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే.. దొరని గోల్కొండ నవాబ్ దోచుకుంటాడు. ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి’ దొచుకుంటాడు.. ‘మనపై ఉన్న ఈ దొంగలు అందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు.
వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరి చేస్తాడు.. అంటూ పవన్‌ను పవర్ ఫుల్‌గా చూపించారు. దీంతో.. ఈ డైలాగ్ పవన్ పాలిటిక్స్‌కు హైప్ ఇచ్చేలా ఉందనే చెప్పాలి. ఇందులో పవన్ స్టంట్స్ అండ్ లుక్ అదిరిపోయింది. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ కనిపించాడు. కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. రెండు భాగాలుగా రానున్న హరిహర వీరమల్లు పార్ట్ 1.. Sword vs Spirit టైటిల్‌తో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.