Euro 2024: In a fierce competition... France reached the quarters
Euro 2024: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఫ్రాన్స్ క్వార్టర్స్ చేరింది. నిన్న అర్థరాత్రి ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై గెలిచింది. బెల్జియం డిఫెండర్ జాన్ వెర్టోంఘెన్ చేసిన పెద్ద తప్పు ఫ్రాన్స్‌కు కలిసొచ్చింది. మ్యాచ్ ఇంకో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా.. జాన్ వెర్టోంఘెన్ సెల్ఫ్ గోల్ చేశారు. ఫ్రాన్స్ ప్లేయర్ రాండల్ కోలో మువానిని తప్పించాలని జాన్ బంతిని తమ గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రాన్స్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత బెల్జియం ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది. ఆటను మూడు నిమిషాలు పొడిగించిన ఫలితం మాత్రం మారలేదు. అలానే ఉంది. పోర్చుగల్, స్లోవెనియా మధ్య జరిగే మ్యాచ్ విజేతతో ఫ్రాన్స్ క్వార్టర్స్ ఫైనల్లో తలపడనుంది.
క్వార్టర్ ఫైనల్స్‌కు మరోసారి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని.. చాలా గర్వంగా కూడా ఉందని ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ అన్నారు. ఇది చాలా సాధారణమైన విషయం అనుకోకూడదు. టోర్నమెంట్లో ఫ్రాన్స్ ఇంకా నాలుగు మ్యాచ్‌లలో ఓపెన్ ప్లే నుంచి స్కోర్ చేయలేదు. కెప్టెన్ కైలియన్ పోలాంలడ్పై పెనాల్టీ నుంచి ఒకసారి నెట్‌ని సాధించాడు. అయితే వారు ఇతర రెండు గోల్లు ప్రత్యర్థి డిఫెండర్ల నుంచి వచ్చినవే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఇప్పటివరకు పెనాల్టీ నుంచి కేవలం ఒక గోల్‌ను మాత్రమే సాధించి డిఫెన్స్‌లో పటిష్ఠంగా ఉన్నారు.
బెల్జియం ఓడిపోవడం నిరాశపరిచిందని, సిగ్గుచేటని కెప్టెన్ కెవిన్ డి బ్రూయిన్ అన్నారు. మాకు ఒక ప్లాన్ ఉంది. వాళ్లకి ఒక ప్లాన్ ఉంది. మాకంటే ఫ్రాన్స్ చాలా బలంగా ఉన్నారు. మేం గోల్‌ను వదిలేయడం సిగ్గుచేటన్నారు. 2018 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌పై 1-0 తేడాతో బెల్జియం ఓటమి పాలయ్యింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని జట్టు భావిస్తోంది. చివరి నిమిషాల్లో గోల్స్ సాధించిన ఇంగ్లాండ్, స్పెయిన్లు కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో స్లోవేకియాపై విజయం సాధించింది. బెల్లింగ్ హమ్(90+5వ నిమిషం), హ్యారీ కేన్(91వ నిమిషం) గోల్స్ సాధించి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించారు. స్లోవేకియా తరఫున షురాంజ్(25వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేశాడు.