»Microsoft Ex Employee Steve Ballmer Is Now Richer Than Bill Gates
Steve Ballmer: సంపదలో బిల్‌గేట్స్‌ను దాటేసిన మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంపదను ఆ సంస్థ మాజీ ఉద్యోగి దాటేశారు. స్టీవ్ బల్మర్ ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఎలాగంటే..?
Steve Ballmer Is Now Richer Than Bill Gates : ఇప్పుడు బిల్‌గేట్స్ కంటే ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి సంపద విషయంలో ముందున్నారు. స్టీవ్ బాల్మర్(Steve Ballmer) మైక్రోసాఫ్ట్‌లో గతంలో సీఈఓగా పని చేశారు. ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల్లో ఆరో స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ని వెనక్కి నెట్టారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
బాల్మన్ 2000 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు మైక్రోసాఫ్ట్‌లో సీఈఓగా పని చేశారు. ఆ తర్వాత పదవీ విరమణ పొందారు. మైక్రోసాఫ్ట్‌లో ఆయనకు పెద్ద సంఖ్యలో షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ షేర్ల విలువ బిల్‌గేట్స్ దగ్గర ఉన్న షేర్ల కంటే మించిపోయింది. దీంతో బాల్మన్ ఇప్పుడు బిల్‌గేట్స్‌ని వెనక్కి నెట్టి అత్యంత సంపన్నుల జాబితాలో ముందు వరుసలో నిలిచారు.
మైక్రోసాఫ్ట్(Microsoft) తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్పై భారీగా పెట్టుబడులు పెట్టింది. ఓపెన్ఏఐ అనే సంస్థతో ఈ విషయమై ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగింది. బిల్‌గేట్స్( Bill Gates) మరోవైపు తన సంపదను తగ్గించుకున్నారు. ఆయన సంపదలో కొంత భాగాన్ని కాస్కేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. తన ఫౌండేషన్ కోసం విరాళాలు ఇచ్చారు. వ్యక్తిగత సంపదలో 60 బిలియన్ డాలర్లను దానంగా ఇచ్చారు. దీంతో ఆయన ఆస్తుల విలువ కాస్త తగ్గింది. షేర్ల పెరుగుదలతో బాల్మన్(Steve Ballmer) ఆస్తుల విలువ పెరిగింది.