»China May Use Ai Content To Influence Lok Sabha Polls Warns Microsoft In Its Report
microsoft : ఎన్నికల వేళ చైనాతో జాగ్రత్త అంటున్న మైక్రోసాఫ్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా మన దేశం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Microsoft: భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్(Microsoft) ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంటెంట్‌ని ఆన్లైన్లో వదిలి ఓటర్లను ప్రభావితం చేయవచ్చని చెప్పింది.
ఏఐ ఆధారిత కాంటెంట్‌తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. ఎన్నికల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్‌ను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా చైనా(China) ప్రచారం చేయనుందని రిపోర్టులో తెలిపింది. కీలకమైన ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్రచారం జరుగుతుందని మైక్రోసాఫ్ట్(Microsoft) పేర్కొంది.
మీమ్స్, వీడియోలు, ఆడియో రూపంలో చైనా ఏఐ కంటెంట్ ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. వాటి ద్వారా తనకు అనుకూలమైన ఫలితాలు వచ్చేలా చూస్తోందని తెలిపింది. అయితే ఇలాంటి ఎత్తుగడలతో అతి పెద్ద దేశమైన భారత్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ ఏడాది మొదట్లో తైవాన్‌లో జరిగిన ఎన్నికల్లోనూ చైనా ఇలాగే ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ని( Ai Content) వ్యాప్తి చేయించిందని తెలిపింది. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించింది.