kalki : కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మే 9న విడుదల కావాల్సిన కల్కి సినిమా ఎన్నికల కారణంగా మరింత ఆలస్యం అయ్యేట్లు ఉంది. కొత్త రిలీజ్ డేట్‌పై ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అది ఎప్పుడంటే..
kalki movie new release date : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా కల్కిని మే 9న విడుదల చేయరని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో భారత దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో విడుదలను వాయిదా వేయనున్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశతో ఉన్నారు. అయితే కల్కి 2898 ఏడీ సినిమాని మే 30న విడుదల చేయనున్నట్లు నెట్టింట్లో వార్త వైరల్ అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్(prabhas)తో పాటుగా అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, దిశా పటానీలు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమ రిలీజ్ విషయంలో మే9ని తమకు కలిసొచ్చే డేట్‌గా చిత్ర యూనిట్ భావించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, మహా నటి లాంటి చిత్రాలు ఇదే తేదీన విడుదలై బ్లాక్ బస్టర్లుగా నిలిచారు. దీంతో అదే డేట్‌ని కల్కి సినిమాకు(kalki movie) సైతం తొలుత ఎంచుకున్నారు.
మే 9న దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉంది. అందుకనే దీని విడుదలను వాయిదా వేయాలని అనుకుంటున్నారట. మరీ ఎక్కువ రోజులు కూడా వాయిదా వేయడం మంచిది కాదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మే 30న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.