»They Come While Changing Clothes Sensational Comments Of The Heroine
Krishna Mukherjee: బట్టలు మార్చుకునేటప్పుడు వచ్చేస్తారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్!
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ చేసే కామెంట్స్ సంచలనంగా ఉంటాయి. ఫలానా వారు తనని వేధించారని, కమిట్మెంట్ అడిగారంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతునే ఉంటారు. లేటెస్ట్గా ఓ సీరియల్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.
They come while changing clothes.. Sensational comments of the heroine!
Krishna Mukherjee: ‘యే హై మొహబ్బతే’, ‘నాగిన్ 3’, ‘కుచ్ తో హై: నాగిన్ కే ఏక్ రంగ్ మే’ వంటి సీరియల్స్ నటి కృష్ణ ముఖర్జీ.. ‘శుభ్ షగున్’ సిరీస్ సెట్స్‌లో తనకు జరిగిన షాకింగ్ సంఘటనను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘నా భావాలను వ్యక్తీకరించే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు. కానీ ఈ రోజు నేను ఈ విషయం గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను ప్రస్తుతం కష్ట సమయాలను ఎదుర్కొంటున్నాను. గత రెండు సంవత్సరాలు నాకు అంత సులభంగా లేదు. నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఏడ్చాను. ‘దంగల్’ ఛానెల్లో చివరి సిరీస్ ‘శుభ్ షగున్’ చేయడం ప్రారంభించినప్పుడే ఇదంతా మొదలైంది. అది నా జీవితంలో చెత్త నిర్ణయం. మాలిక్ ప్రొడక్షన్ హౌస్, నిర్మాత కుందన్‌సింగ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.
ఇది మాత్రమే కాదు, ఒకానొక సమయంలో నా మేకప్‌ను గదిని లాక్ చేశారు. అప్పుడు నేను అనారోగ్యంతో ఉండేదాన్ని. నాకు గౌరవ వేతనం కూడా ఇవ్వలేదు. అందుకే షూటింగ్‌కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకునేటప్పుడు తలుపులు పగులగొట్టినట్టుగా, బిగ్గరగా తలుపులు కొట్టేవారు. ఈ విషయంలో నేను చాలా మంది నుండి సహాయం కోరుతున్నాను. ఎవ్వరూ సహాయం చేయలేదు.. అని కృష్ణ ముఖర్జీ తెలిపింది. ఇది రాస్తున్న సమయంలో నా చేతులు వణుకుతున్నాయి. నా కుటుంబం నన్ను ఇలాంటివి పోస్ట్ చేయద్దని చెప్తున్నారు. వాళ్లు నిన్ను ఏదైనా చేస్తే ఏంటి పరిస్దితి అని భయపడుతున్నారు. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. నాకు న్యాయం కావాలి.. ఇది నా హక్కు అని.. రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.