పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి.. సినిమాల పరంగా ఇప్పట్లో కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ రీ ఎంట్రీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
Pawan Kalyan: 2018 తర్వాత సినిమాలకు దాదాపుగా గుడ్ బై చెప్పాడు పవన్. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇక సినిమాలు చేయడం కష్టం అనుకున్నారు. కానీ పొలిటికల్‌గా ఎదురు దెబ్బ పడడంతో దాదాపు మూడేళ్లు గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో హిందీ సినిమా పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు.
కరోనా తర్వాత ఆడియెన్స్ థియేటర్లోకి రారు అనే భయంతో ఉన్న ఉన్న ఇండస్ట్రీకి.. ఈ సినిమా ఊరటనిచ్చింది. అప్పట్లో వకీల్ సాబ్ మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా.. అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. పవన్ పవర్ ఫుల్ లాయర్‌గా నటించాడు. ఈ సినిమాలో పవన్ స్టైల్‌కు ఆయన చెప్పిన డైలాగ్స్‌కు మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఇక ఇప్పుడు మరోసారి పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మే 1వ తేదీన వకీల్ సాబ్ రీ రిలీజ్ కానుంది. దీంతో పొలిటికల్ న్యూస్‌తోనే సరిపెట్టుకున్న ఫ్యాన్స్‌కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా వకీల్ సాబ్‌ను మళ్లీ థియేటర్లో ఎంజాయ్ చేయడం పక్కా. ఇప్పటికే టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి వకీల్ సాబ్ రీ రిలీజ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.