»Movies Postponed Fans Get Ready Prabhas Ntr Bunnyde Hawa
Movies Postponed: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీదే హవా?
సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోవాల్సిన పెద్ద సినిమాలు.. ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సమ్మర్ కాస్త సప్పగానే ఉంది. కానీ అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉండబోతున్నాయి.
Movies Postponed: Fans Get Ready.. Prabhas, NTR, Bunnyde Hawa?
Movies Postponed: ఏప్రిల్ 5న రావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ అక్టోబర్ 10కి షిప్ట్ అయింది. మే 9న రావాల్సిన కల్కి కూడా పోస్ట్‌పోన్ అయింది. దీంతో.. మళ్లీ థియేటర్లో మాస్ జాతర జరగాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లోటును భర్తీ చేయడానికి సాలిడ్ అప్డేట్స్ మాత్రం బయటికి రానున్నాయి. వచ్చే నెలలో వరుసగా అప్డేట్లు రాబోతున్నాయి. మే నెల మొత్తాన్ని ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ కబ్జా చేయనున్నారు. ముందుగా.. మే నెల సినిమా సందడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మొదలు కానుంది.
పుష్ప2 సినిమా ఫస్ట్ సింగిల్‌ను మే 1న రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వారం, పది రోజుల పాటు సోషల్ మీడియా షేక్ అవనుంది. ఇక మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. ఆ రోజు దేవర నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే.. వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా బయటికి రానున్నట్టుగా టాక్.
ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి ప్రమోషన్స్‌ను మే నెలలోనే మొదలు పెట్టనున్నారు. ఆ నెల మొత్తం కల్కికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రానున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాల అప్డేట్లు కూడా ఇదే నెలలోనే రాబోతున్నాయి. పూరీ జగన్నాథ్, రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీజర్ లేదా ఫస్ట్ సాంగ్‌ను మే 15న విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా.. సమ్మర్లో వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవనున్నారు.