ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద కాస్త ఎక్కువగా ఉంటోంది. ఎంత జాగ్రత్తగా ఉన్న సరే.. లీకుల్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. తాజాగా సీతారాముడిగా నటిస్తున్న సాయి పల్లవి, రణ్‌బీర్ ఫోటోలు లీక్ అయ్యాయి.
Ramayanam Photos Leak: Sai Pallavi and Ranbir's photos as Sita Ram leaked!
Ramayanam Photos Leak: రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. గతేడాది ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అయితే.. ఈ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టేసింది. ఇక ఇప్పుడు అదే బాలీవుడ్ నుంచి భారీ బడ్జెజ్‌తో మరో రామాయాణం రాబోతోంది. అయితే.. ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ సైలెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి సీత, రాముడు పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అవగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సీతగా.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నితీష్ తివారి. రీసెంట్‌గానే షూటింగ్ మొదలు పెట్టారు. కానీ ఊహించని విధంగా ఆన్ సెట్స్ నుంచి సాయి పల్లవి, రాణ్‌బీర్ లుక్స్ లీక్స్ అయ్యాయి. ఇద్దరు కూడా సీతారాములుగా చూడ్డానికి బాగున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి లుక్కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఆమె సీత పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అనే చెప్పాలి.
అయితే.. అనిమల్ సినిమాలో రణ్‌బీర్‌ను చూసిన వారు.. రాముడిగా చూస్తే షాక్ అవాల్సిందే. పూర్తిగా తన లుక్‌ని మార్చేశాడు రణ్‌బీర్. ఇక ఈ లీక్డ్ ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్లో భారీ సెటప్ కనిపిస్తోంది. అయితే.. ఈ సినిమాలో రావణుడిగా కెజియఫ్ హీరో యష్ నటిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే యష్ షూటింగ్లో జాయిన్ అవనున్నాడని అంటున్నారు. ఏదేమైనా.. అప్పుడే ఈ సినిమా నుంచి ఫోటోలు లీక్ అవడం మాత్రం.. మేకర్స్‌ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి.