Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం నిలకడగానే ఉంది
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్‌కు చెందిన మెడికల్ బృందం తెలిపింది.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతను టైప్-2 డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు కాన్ఫరెన్స్‌లో సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అరగంట పాటు ఎయిమ్స్ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రస్తుతం అతను మందులనే కొనసాగించాలని సూచించారు. వీటితో పాటు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపారు. మళ్లీ వారం తర్వాత ఈ బృందం సీఎంను పరీక్షించనున్నట్లు తెలిపారు.