»Everything Has Changed In 20 Years Except One Thing Google Ceo Sundar Pichais Post Goes Viral
Sundar Pichai: 20 ఏళ్లలో అన్ని మారాయి ఒక్కటి తప్ప.. గూగుల్ సీఈఓ పోస్ట్ వైరల్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురించి అందరికి తెలిసిందే. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి కంపెనీ సీఈఓ స్థాయికి ఎదగిన ఘనడు ఆయన. కంపెనీలో చేరి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Everything has changed in 20 years except one thing.. Google CEO Sundar Pichai's post goes viral
Sundar Pichai: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఐటీ విభాగంలో ఉద్యోగం చేసేవారికి, చేయాలని అనుకునే వారికి ఆయన స్పూర్తి. భారత్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రపంచం గర్వించదగ్గ కంపెనీ గూగుల్ సీఈఓ అంటే మాటలా. ఆ కంపెనీలో చేరి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సుందర్ పిచాయి ఓ పోస్ట్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘‘ఏప్రిల్ 26, 2004 గూగుల్ కంపెనీలో మొదటిరోజు. అప్పటి నుంచి ప్రపంచంతో పాటు నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సాంకేతికత అంశాలు మారాయి, మా ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇలా ప్రతీది మారింది. అలాగే నా జుట్టు కూడా మారింది అంటూ ఈ 20 ఏళ్లలో ఒక విషయం మాత్రం మారలేదు అని రాసుకొచ్చారు.
ఈ అద్భుతమైన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను పొందే థ్రిల్ ఇప్పటికీ మారలేదని పేర్కొన్నారు. ఈ గొప్ప కంపెనీలో భాగమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడినని భావిస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు’’ ఈ మాటలతో పాటు 20 నంబర్ ఉన్న బెలున్ బొమ్మను, పక్కనే 2004లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన ఐడీ కార్డును పంచుకున్నారు. దాంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. మీ జుట్టు తగ్గింది.. గూగుల్ ఆదాయం పెరిగింది. మీరే నాకు ఇన్సిపిరేషన్ అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. కంపెనీలో సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టిన సుందర్ పిచాయ్ ఆయన ప్రతిభతో కంపెనీకి ఎంతో సేవ చేశారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ లాంటి ఆవిష్కరణలు చేశారు. ఆయన ప్రతిభకు ప్రతిఫలంగా 2015లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.