»Tough Decision To Eliminate The Jobs Of Google Company Sundar Pichai
Sundar Pichai: ఉద్యోగుల తొలగింపు కఠినమైన నిర్ణయం
ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించడం కఠినమైన నిర్ణయం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు.
tough decision to eliminate the jobs of Google Company.. Sundar Pichai
Sundar Pichai: మాంద్యం భయంతో ప్రపంచంలో అగ్ర కంపెనీలు సైతం ఈ సంవత్సరంలో పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించాయి. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ గూగుల్(Google) సంస్థ, దాని అనుసంధాన సంస్థ అల్ఫాబెట్(Alphabet) సైతం 12 వేల ఉద్యోగులను తొలగించింది. ఇలాంటి సంఘటనలు చాలా కంపెనీలో జరిగి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) స్పందించారు. తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో లేఆఫ్లపై అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ కంపెనీ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
కేవలం శ్రామిక శక్తిని తగ్గించడానికి లేఆఫ్ లాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయంతో కంపెనీపై ఎలాంటి ప్రభావం పడిందన్న ప్రశ్నకు పిచాయ్ బదులిస్తూ.. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని, భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ లేఆఫ్ దిశగా అడుగులు వేసిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఏ కంపెనీకైనా కష్టమన్నారు. ఉద్యోగులను తొలగించడం చాలా కఠినమైన నిర్ణయం అని పిచాయ్ పేర్కొన్నారు. ఉద్యోగులను తొలగించడం అనేది కరెక్ట్ కాదని, దానికి ప్రత్యామ్నాయ పద్దతులు ఆలోచించాలని పిచాయ్ తెలిపారు.