PDL: బొట్ల వనపర్తి సర్పంచ్ రంజిత్ కుమార్ యాదవ్ తన ఉదారతతో ఆదర్శంగా నిలిచారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో వచ్చే గౌరవ వేతనాన్ని (నెలకు రూ.6,000) స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధూప దీప నైవేద్యాలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, గ్రామసభలో అంగీకార పత్రం అందజేశారు. ఆయన సేవాగుణాన్ని గ్రామస్థులు కొనియాడారు.