»Google Fired Another 200 Employees Ongoing Google Lay Offs
Google Lay Offs: మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ గత కొంత కాలంగా భారీగా లేఆఫ్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. తక్కువ వేతనానికి పనిచేసే వారు ఉండడంతో ఈ కోత తప్పడం లేదని తెలుస్తుంది.
Google fired another 200 employees. Ongoing Google Lay Offs
Google Lay Offs: ప్రముఖ టెక్ దిగ్గజం, సెర్చింజన్ గూగుల్ కంపెనీ గత కొంత కాలంగా ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 200 మందిని తమ విధుల నుంచి తొలగించింది. కోర్ టీంలో పనిచేసే వీరిని తాజాగా ఇంటికి పంపించింది. ఇదివరకు కూడా కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలా మందికి లేఆఫ్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ఆదాయ నివేదికలో గూగుల్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దాంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా కాలిఫోర్నియా, సన్నీవేల్‌లోని కోర్ టీమ్‌లో పనిచేసే ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులను తొలగించింది. వీరికంటే చౌకగా పనిచేయడానికి అమెరికా వెలుపల ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆ పొజిషన్లను ఇండియా, మెక్సికో కంపెనీలకు బదిలీ చేసినట్లు సీఎన్‌బీసీ నివేదించింది.
ఇటీవలే గూగుల్ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీంలో పనిచేసే చాలా మంది ఉద్యోగులను తొలగించింది. కేవలం గూగుల్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నది. ఈ ఏడాది టెక్ రంగంలో 70 వేలకు పైగా ఉద్యోగస్తులు తమ జాబ్స్‌ను కోల్పోయారు. గూగుల్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలతో పాటు ఎలాన్ మస్క్‌కు కార్ల తయారీ సంస్థ టెస్లా సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. దీనితో పాటు ఇప్పుడు ఏఐ ప్రభావం కూడా ఐటీ ఉద్యోగులపై పడనుంది.