»Googles Long Awaited Find My Device Network Launched
Google : స్విచ్ ఆఫ్ అయినా ఫోన్‌ని కనిపెట్టే గూగుల్ సరికొత్త ఫీచర్
ఫోన్ పోగొట్టుకోవడం అనే విషయం దాదాపుగా చాలా మందికి అనుభవమే. అలాంటి సమయంలో మన ఫోన్ ఎక్కడుందో కనిపెట్టగల ఓ ఫీచర్‌ని గూగుల్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
Google Find My Device Network : పోయిన ఫోన్‌ని తేలికగా కనిపెట్టేందుకు వీలుగా గూగుల్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఆ ఫీచర్ ‘ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్’ను ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో సోమవారం గూగుల్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కెనడా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది.
ఈ ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్(Find My Device Network) ఫీచర్‌తో పొగొట్టుకున్న ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. అలాగే ఒకవేళ దొంగలు మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేవచ్చు. అది కూడా ఇంటర్నెట్, వైఫై కనెక్షన్లతో అది అనుసంధానం అయి లేకపోయినా బ్లూటూత్‌ని ఉపయోగించి ట్రాక్ చేసేలా ఈ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది గూగుల్.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 నంచి ఆపై వెర్షన్లు ఉన్న మొబైళ్లలో మాత్రమే అందుబాటలో ఉంటుంది. పొగొట్టుకున్న వస్తువులను గుర్తించడానికి ఈ ఫీచర్లో ఐదు రకాలు మార్గాలు ఉన్నాయి. ఈ ఫీచర్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు, వాటితో పెయిర్ చేసిన ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చట. అంతేకాదు ఆండ్రాయిడ్ ఫోన్‌తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైక్‌లనూ సులువుగా కనిపెట్టేయవచ్చని గూగుల్ చెబుతోంది. ఇంత మంచి ఫీచర్ మన దగ్గర ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, , ఎలా పని చేస్తుందో? చూడాలి మరి!